ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (20:51 IST)

అమేజాన్ అధినేత మాజీ భార్య.. సైన్స్ టీచర్‌ను మనువాడింది..!

MacKenzie Scott
అమేజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెన్‌జీ స్కాట్ షాకిచ్చింది. ప్రపంచ కుబేరుడైన జెఫ్ బెజోస్‌కు మాజీ భార్య అయిన ఆమె ఓ స్కూల్ టీచర్‌ను వివాహం చేసుకుంది. బెజోస్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి 2019లో స్వస్తి పలికిన మెకెన్‌జీ అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటోంది. అయితే తాజాగా డాన్ జివెట్ అనే స్కూల్ టీచర్‌ను పెళ్లి చేసుకుంది. 
 
మెకెన్‌జీ పిల్లలు చదువుతున్న స్కూల్‌లోనే జివెట్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు.  శనివారం తమ వివాహానికి సంబంధించి అధికారికంగా ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా మెకెన్‌జీ వయసు ప్రస్తుతం 50 ఏళ్లు. ఆమె ఆస్తి విలువ దాదాపు 53 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు 4 లక్షల కోట్లు.
 
ఇదిలా ఉంటే మెకెన్‌జీ వివాహంపై బెజోస్ కూడా స్పందించాడు. జివెట్ చాలా మంచి వ్యక్తిని, వారిద్దరు ఒక్కటైనందుకు ఆనందంగా ఉందని బెజోస్ అన్నాడు. బెజోస్-మెకెన్‌జీలకు మొత్తం నలుగురు పిల్లలున్నారు. వారంతా ప్రస్తుతం మెకెన్‌జీతోనే ఉన్నారు. ఈ విషయాన్ని కూడా ఆమె తాజాగా వెల్లడించింది.