శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మే 2024 (12:25 IST)

ఉత్తర కొరియా నియంత కోసం ప్లెజర్ స్క్వాడ్ : 25 అమ్మాయిలతో ప్రత్యేక బృందం...

ప్రపంచ నియంతగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పేరు గడించారు. అయితే, ఈయన చేసే ప్రతి పని సంచలనమే. తీసుకునే నిర్ణయం అంతకంటే సంచలనం. తాజాగా ఆయనకు సంబంధించిన సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తనను సంతోష పెట్టేందుకు 25 మంది అందమైన అమ్మాయిలతో కూడిన ప్లెజర్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసుకుని తన పర్యవేక్షణలో ఉచుకున్నట్టు సమాచారం. ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న యోన్మీ పార్క్ అనే యువతి ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
జర్ స్వాడ్ పనిచేసేందుకు ప్రతి ఏడాది 25 మంది వర్జిన్ అమ్మాయిలను కిమ్ ఎంపిక చేసుకుంటారని తెలిపింది. అమ్మాయిల ఆకృతి, దేశం పట్ల వారి కుటుంబ విధేయత ఆధారంగా యువతులను ఎంపిక చేసుకుంటారని యోన్మీ వివరించింది. 'ప్లెజర్ స్క్వాడ్'లోకి తనను రెండు సార్లు పరిశీలించినప్పటికీ తన కుటుంబ నేపథ్యం కారణంగా తనను తిరస్కరించారని ఆమె వెల్లడించారు.
 
అమ్మాయిల కోసం వారు స్కూళ్లలోని ప్రతి తరగతి గదిలోకి వెళ్లి చూస్తారని, అందమైన వారు ఎవరైనా పొరపాటున మిస్ అవుతారనే ఉద్దేశంతో స్కూల్ గ్రౌండ్లలో కూడా తనిఖీ చేస్తారని వెల్లడించింది. కొంతమంది అందమైన అమ్మాయిలను గుర్తించిన తర్వాత తొలుత వారి కుటుంబ స్థితిగతులు తెలుసుకుంటారని, అనంతరం దేశం విషయంలో వారి నిబద్ధతను పరిశీలిస్తారని యోన్మీ తెలిపింది. 
 
ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న కుటుంబ సభ్యులు లేదా దక్షిణ కొరియా లేదా ఇతర దేశాలలో బంధువులు ఉన్న కుటుంబాల అమ్మాయిలను 'ప్లెజర్ స్క్వాడ్'లోకి తీసుకునేవారు కాదని వివరించింది. ఇక అమ్మాయిల ఎంపిక పూర్తయిన అనంతరం వారు కన్యలు అని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు చేయిస్తారని, చిన్న లోపాన్ని గుర్తించినా వారిని పక్కనపెట్టేస్తారని యోన్మీ వివరించారు. కఠినమైన పరీక్షల అనంతరం అమ్మాయిలను రాజధాని ప్యాంగ్యాంగ్‌కు పంపుతారని, అక్కడ నియంత కోరికలను తీర్చాల్సి ఉంటుందని యోన్మీ వివరించినట్టు 'మిర్రర్' కథనం పేర్కొంది.
 
'ప్లెజర్ స్క్వాడ్'ను మూడు విభిన్న గ్రూపులుగా విభజిస్తారు. ఒక బృందానికి మసాజ్, మరొక బృందానికి పాటలు, డ్యాన్స్ చేయడంలో శిక్షణ ఇప్పిస్తారు. ఇక మూడవ సమూహం నియంత కిమ్ జోంగ్ ఉన్, ఇతర ఉన్నతాధికారుల లైంగిక కోర్కెలు తీర్చాల్సి ఉంటుంది. పురుషులను ఎలా సంతోషపెట్టాలో ఈ అమ్మాయిలు నేర్చుకోవాల్సి ఉంటుందని, అదే వారి ఏకైక లక్ష్యం అని యోన్మీ పార్క్ వివరించినట్టు 'మిర్రర్' కథనం పేర్కొంది.