సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (11:15 IST)

153 కేజీల సమోసా... ఎక్కడ? వైరల్ అయిన వీడియో

లండన్‌కు కొంతమంది పాకశాస్త్ర నిపుణులు ప్రపంచంలోనే అతిపెద్ద సమోసాను తయారు చేశారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటుదక్కించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌కు చెం

లండన్‌కు కొంతమంది పాకశాస్త్ర నిపుణులు ప్రపంచంలోనే అతిపెద్ద సమోసాను తయారు చేశారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటుదక్కించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌కు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఈ సమోసాను తయారు చేశారు. 
 
దీని తయారీ కోసం 44 కేజీల మైదాపిండి, భారతీయ సుగంధ ద్రవ్యాలు, 100 కేజీల బంగాళా దుంపలు, 25 కేజీల ఉల్లిపాయలు, 15 కేజీల బఠానీలను ఇందుకోసం ఉపయోగించారు. ఈ సమోసా తయారీలో 12 మంది పాకశాస్త్ర నిపుణులు 15 గంటల పాటు శ్రమించి తయారు చేశారు. 
 
ఈ సమోసా బరువు 153.1 కేజీలు. ఈ సందర్భంగా తీసిన వీడియోను గిన్నిస్ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్‌గా మారింది. దానిని మీరు కూడా చూడండి.