బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 21 జులై 2017 (21:07 IST)

మన మహిళలు ప్రపంచ కప్ ఫైనల్‌కు వచ్చేశారు... గెలిచే జట్టు ఏది?

భారత మహిళా క్రికెట్‌ ఫైనల్‌కు చేరుకుంది. దీనికి కారణం హర్మన్ ప్రీత్ కౌర్ అనే ఈ పంజాబ్ పుత్రిక తన పేరును క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ప్రపంచ క్రికెట్‌లో మెరుపు బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్‌ను ఆదర్శంగా తీసుకున్న

భారత మహిళా క్రికెట్‌ ఫైనల్‌కు చేరుకుంది. దీనికి కారణం హర్మన్ ప్రీత్ కౌర్ అనే ఈ పంజాబ్ పుత్రిక తన పేరును క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ప్రపంచ క్రికెట్‌లో మెరుపు బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్‌ను ఆదర్శంగా తీసుకున్న ఆ క్రీడాకారిణి తన భీకర బ్యాటింగుతో సెహ్వాగ్‌నే మరిపించింది. ఆ క్రీడా విన్యాసానికి దిగ్గజాలతో సహా క్రికెట్ ప్రపంచమే ఫిదా అయిపోతోంది. మిథాలీ రాజ్ మాత్రమే స్టార్ బ్యాట్మ్ వుమెన్‌గా వెలుగుతున్న భారత మహిళా క్రికెట్‌లో మెరుస్తున్న కొత్త సంచలనాల్లో సూపర్ సంచలనం హర్మన్ ప్రీత్ కౌర్.
 
మెరుపు వేగంతో కౌర్ బ్యాటింగ్‌ చేయడం, అలవోకగా బౌండరీలు, భారీ సిక్సర్లు బాదడం కొత్త కాదు. ఇది ఆమె సహజశైలి మాత్రమే. ఈ తరహా దూకుడైన బ్యాటింగ్‌ వల్లే బిగ్‌బాష్‌ జట్టు సిడ్నీ థండర్స్‌ హర్మన్‌ను ఏరికోరి ఎంచుకుంది. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారత క్రీడాకారిణి కౌర్‌ కావడం విశేషం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కౌర్‌ తొలి మ్యాచ్‌లోనే 28 బంతుల్లో 47 పరుగులు సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో ఆమె లాఫ్టెడ్‌ కవర్‌ డ్రైవ్‌ను అద్భుతమైన సిక్సర్‌గా మలచడం చూసి కామెంటరీలో ఉన్న గిల్‌క్రిస్ట్‌ ‘నేను చూసిన అత్యుత్తమ క్రికెట్‌ షాట్‌. ఆమె ఆటతో నేను అచ్చెరువొందాను’ అని వ్యాఖ్యానించడం విశేషం. ఇకపోతే జట్టు సమిష్టి కృషితో ఫైనల్ వరకూ వచ్చేసింది. మరొక్క అడ్డంకిని దాటుకుని ఆదివారం జరిగే ఫైనల్లో కూడా హర్ ప్రీత్ సింగ్ ఇలాగే  విజృభించి ఆడి ఇండియా జట్టును గెలిపిస్తే భారత మహిళా క్రికెట్‌ను ఇన్నేళ్లుగా ఒంటి చేత్తో మోసిన మిథాలీ రాజ్‌కు అపూర్వ గౌరవాన్ని కట్టబెట్టినట్లే అవుతుంది.