బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (17:37 IST)

ఆ యువకుడు నిద్రపోతే ప్రాణం పోతుంది.. (వీడియో)

ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు అరుదైన రోగంతో బాధపడుతున్నాడు. అతడు కానీ నిద్రపోతే.. ప్రాణం కోల్పోతాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన లియాం డెర్బిపిషర్ (17) అనే యువకుడికి హైపోవెంటిలేషన్ సిండ్రోమ

ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు అరుదైన రోగంతో బాధపడుతున్నాడు. అతడు కానీ నిద్రపోతే.. ప్రాణం కోల్పోతాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన లియాం డెర్బిపిషర్ (17) అనే యువకుడికి హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అనే విచిత్ర వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా ఆ యువకుడు పుట్టినప్పటి నుంచి ఆ యువకుడు నిద్రపోతే.. ప్రాణాలు కోల్పోతాడు. ముఖ్యంగా ఈ యువకుడు తగిన భద్రత లేకుండా నిద్రపోలేడు. ఒకవేళ నిద్రపోతే.. అతని లివర్ పనిచేయడం ఆగిపోతుంది. ఇంకా హార్ట్ బీట్ తగ్గిపోతుంది. రక్తపోటు ఏర్పడుతుంది. 
 
ఇదే గనుక ఎక్కువ సేపు జరిగితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా వుందని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యాధితో ప్రపంచ వ్యాప్తంగా 1500 మంది బాధపడుతున్నారని తెలిపారు. ఇంగ్లండ్ యువకుడు నిద్రపోవాలంటే వైద్యులు తగిన వైద్య ఉపకరణాలు వుంచితేనే అతను ప్రశాంతంగా నిద్రపోగలడు. లేదంటే ఆ యువకుడు శాశ్వత నిద్రలోకి జారుకునే ప్రమాదం వుంది. ఆ యువకుడు పడేపాట్లను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోండి.