శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (10:18 IST)

పాకిస్థాన్‌లో రూ.10 కోట్లతో కృష్ణుడి దేవాలయం.. ఖర్చంతా సర్కారుదే..!

పాకిస్థాన్‌లో రూ. 10 కోట్లతో కృష్ణుడి దేవాలయం నిర్మితమవుతోంది. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు అయ్యే ఖర్చును ఆదేశ ప్రభుత్వమే భరిస్తోంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలయ నిర్మాణంలో జాప్యం ఏర్పడుతోంది. ఇస్లామాబాద్‌లో పది కోట్ల రూపాయలతో హిందూ దేవాలయం నిర్మాణం పనులను పాకిస్థాన్ ప్రభుత్వం మొదలు పెట్టింది.
 
ఇస్లామాబాద్‌లో ఇదే తొలి హిందూ ఆలయం కావడం విశేషం. 20వేల చదరపు అడుగుల స్థలంలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని నిర్మించనున్నారు. దీనికి పార్లమెంటరీ మానవ హక్కుల సంఘం కార్యదర్శి లాల్ చంద్ మల్హి మంగళవారం భూమిపూజ చేశారు. గత రెండు దశాబ్దాల్లో ఇస్లామాబాద్‌లో హిందువుల జనాభా గణనీయంగా పెరిగిందని మల్హి చెప్పినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. 
 
కొత్తగా నిర్మించబోయే ఆలయానికి శ్రీ కృష్ణ మందిర్ అని ఇస్లామాబాద్ హిందూ పంచాయత్ పేరు పెట్టింది. ఈ ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 10 కోట్లను పాక్ మతపరమైన వ్యవహారాల శాఖ మంత్రి పిర్ నూరుల్ హక్ ఖాద్రీ తెలిపారు.