శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 జూన్ 2020 (12:10 IST)

పాక్ డ్రోన్‌ను కూల్చేసిన భారత్ భద్రతా దళాలు

ఒకవైపు చైనా దొంగదెబ్బ తీసి 20 మంది సైనికులను పొట్టనబెట్టుకుంటే మరోవైపు పాకిస్తాన్ తన నక్కజిత్తులను మరోసారి బయటపెట్టింది. జమ్మూ కశ్మీర్‌లోని దేశ సరిహద్దు రహస్య డ్రోన్‌ను పంపి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన భారత భద్రతా బలగాలు కూల్చేసాయి
కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలను భద్రతా దళాలు పసిగట్టాయి. వెంటనే బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున ఈ డ్రోన్‌ను కూల్చేశాయి. ఈ డ్రోన్ ను పరిశీలించగా ఇందులో తుపాకులు కూడా వున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి వుంది.