ganesh chaturthi

క్షణాల్లో 12 అంతస్తుల భవనం నేలమట్టం... 99 మంది మిస్సింగ్

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 25 జూన్ 2021 (11:56 IST)
ఫ్లోరిడాలో 12 అంతస్తుల భవనం క్షణాల్లో నేలమట్టమైంది. ఈ ఘటన తర్వాత సుమారుగా వంద మంది వరకు మిస్సింగ్ అయినట్టు సమాచారం. వీరి కోసం రెస్క్కూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వీరంతా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వీరిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన అమెరికా ఫోర్లిడాలోని మియామి నగరంలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మియామిలోని ఓ 12 అంతస్తుల బిల్డింగ్‌లో కొంత భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 102 మంది ఆచూకీ లభించిందని.. మరో 99 మంది గురించిన సమాచారం తెలియాల్సి ఉందని చెప్పారు. అయితే ఈ ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో బిల్డింగ్‌లో మొత్తం ఎంత మంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు.
 
సర్ఫ్‌సైడ్‌లో ఉన్న ఈ భవనాన్ని 1980లో నిర్మించారు. అయితే బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దాదాపుగా బిల్డింగ్ సగభాగం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. బిల్డింగ్ కూలిన సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని.. క్షణాల్లో ఆ ప్రాంతంలో దుమ్ము, ధూళితో నిండిపోయిందని స్థానికులు తెలిపారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 35 మందిని బయటకు తీశారు. వారిలో ఇద్దరిని ఆస్పత్రికి పంపగా, మిగిలినవారి గాయాలకు ప్రథమ చికిత్స చేశారు. 

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments