ఆదివారం, 17 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (19:20 IST)

భయపడుతున్న హిమాలియన్ గ్లేసియర్లు.. నదులు మాయమవుతాయా?

మన జీవ నదులకు మూలమైన హిమాలయన్ గ్లేసియర్లే ఇప్పుడు భయపెడుతున్నాయి. ఇవి ఊహించని వేగంతో కరిగిపోతుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దీనివల్ల ఏకంగా వంద కోట్ల మంది జీవితాలు ప్రమాదంలో పడనున్నట్లు ఐఐటీ ఇండోర్ అధ్యయనం తేల్చింది. హిమాలయన్ కారకోరం పరిస్థితిపై ఐఐటీ ఇండోర్ టీమ్ అధ్యయనం చేసింది. 
 
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇక్కడి గ్లేసియర్లు చాలా వేగంగా కరిగిపోతున్నట్లు తేలింది. దీనివల్ల సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో నీటి మట్టం రానున్న దశాబ్దాల్లో భారీగా పెరగనుంది. ఫలితంగా ఈ నదుల దిగువ మైదానాల్లో వచ్చే వరదలు కోట్ల మంది జీవితాలను అతలాకుతలం చేయనున్నాయి. 
 
ఈ గ్లేసియర్లు ఇలా కరుగుతూ వెళ్తే నదుల్లో నీటి మట్టం క్రమం పెరుగుతూ తర్వాత తగ్గిపోతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ జీవ నదుల్లో అసలు నీటి ప్రవాహమే ఉండని దుస్థితి తలెత్తుందని ఐఐటీ ఇండోర్ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనాన్ని సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.