మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (15:40 IST)

భారతదేశ హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ కన్నుమూత

MS Swaminathan
MS Swaminathan
భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. లేరు. 98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు తుది శ్వాస విడిచారని కుటుంబీకులు తెలిపారు. 
 
స్వామినాథన్ 1987లో చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. దాని ద్వారా ఆయన మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు. స్వామినాథన్ అనేక అవార్డులను అందుకున్నారు. అలా స్వామినాథన్ ఖాతాలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇందిరా శాంతి బహుమతులున్నాయి.