పిల్లలు లేని మహిళల కోసం ఆన్‌లైన్ డాడీ.. యాప్‌లో ఆర్డర్ చేయమంటున్న ఎన్నారై డాక్టర్ కమల్ అహూజా
పిల్లలు లేని మహిళల కోసం ఆన్‌లైన్ డాడీ అందుబాటులోకి వచ్చాడు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. యాప్‌లో ఆర్డర్ చేయడమే. లండన్‌లోని ఈ భారత సంతతి డాక్టర్ కమల్ అహూజా ఈ యాప్‌ను తయారు చేశారు. లండన్ స్పెర్
పిల్లలు లేని మహిళల కోసం ఆన్‌లైన్ డాడీ అందుబాటులోకి వచ్చాడు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. యాప్‌లో ఆర్డర్ చేయడమే. లండన్‌లోని ఈ భారత సంతతి డాక్టర్ కమల్ అహూజా ఈ యాప్‌ను తయారు చేశారు. లండన్ స్పెర్మ్ బ్యాంకు సైంటిఫిక్ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతున్నారు.
'ఆర్డర్ ఏ డాడీ' పేరిట సరికొత్త యాప్‌ను విడుదల చేశారు. తన బిడ్డకు డాడీగా ఎవరుండాలో? ఎలా ఉండాలో? ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చని, అతని వీర్యాన్ని పంపుతామని చెబుతున్నారు.
ఇది పూర్తి చట్టబద్ధంగా తయారైన యాప్ ద్వారా డాడీ ఎత్తు ఎంతుండాలి? కళ్లెలా ఉండాలి? జుట్టు ఎలా ఉండాలి? ఎంతవరకూ చదువుకోని ఉండాలి? వంటి ఎన్నో అంశాలను పరిశీలించి డోనర్‌ను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. 950 పౌండ్లతో తాము కోరుకున్న సంతాన ఉత్పత్తి కేంద్రానికి వీర్యాన్ని పంపుతామని చెబుతున్నారు.