గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (16:15 IST)

అత్యంత విషమంగా నిత్యానంద ఆరోగ్యం : శ్రీలంక వర్గాలు

Nityananda
వివాదాస్పద, ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ఆరోగ్యం మరింత విషమంగా ఉందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయన అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. అందువల్ల ఆయనకు అత్యవసరంగా చికిత్స చేయాలని తెలిపింది. ప్రస్తుతం నిత్యానంద పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
గత 2010లో అత్యాచారం కేసులో అరెస్టు అయిన నిత్యానంద స్వామి ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. అయితే, కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయాడు. 
 
ఈ క్రమంలో ఈక్వెడార్ దేశంలోని ఓ చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాస దేశం అనే పేరు పెట్టారు. ఈ దేశానికి అధ్యక్షుడు తానేనని, తన దేశానికి ఎవరైనా రావొచ్చని ప్రకటించారు. పైకా, కైలాస్ దేశానికి కొత్త కరెన్సీ కూడా ప్రకటించారు.