గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (11:09 IST)

ఆసియా కప్‌లో బోణీ కొట్టిన లంక - బంగ్లాకు రెండో ఓటమి

sri lanka
ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయభేరీ మోగించింది. తొలి మ్యాచ్‍లో క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ చేతిలో ఓడిపోయిన లంకేయులు తన రెండో మ్యాచ్‌లో మాత్రం బంగ్లాదేశ్‌పై విజయం సాధించారు. అదేసమయంలో బంగ్లాదేశ్ జ్టటు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫిఫ్ హొసైన్ 39, మిరాజ్ 38, హాసన్ 24, మహ్మదుల్లా 27, హొసైన్ 24 చొప్పున పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ, కరుణరత్నెలు తలా రెండేసి వికెట్లు తీశారు. 
 
ఆ తర్వాత 184 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక జట్టు మరో నాలుగు బంతులు మిగిలివుండగానే విజయాన్ని చేరుకుంది. ఫలితంగా 2 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఆ జట్టులో కుశాల్ మెండిస్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేయగా కెప్టెన్ దాసున్ శంక 45 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.