మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (06:38 IST)

ఉ.కొరియాలో అణుప్రమాదం.. 200 మంది మృత్యువాత

ఉత్తర కొరియాలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఉత్తర కొరియాలోని పుంగేరీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఉత్తర కొరియాలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఉత్తర కొరియాలోని పుంగేరీ ప్రాంతంలో ఉన్న అణుప్రయోగ స్థలంలోని ఓ భారీ సొరంగం కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ విషయాన్ని జపాన్‌ మీడియా అధికారికంగా వెల్లడించింది. గత నెల 10వ తేదీన మిలిటరీ సైట్‌ వద్ద నిర్మాణ పనులు చేపట్టుతుండగా ఒక్కసారిగా సొరంగం కూలిపోయినట్లు పేర్కొంది. తొలుత సొరంగంలో 100 మంది చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపడుతుండడంతో మిగిలిన భాగం వారిపై కూలిపోయింది.
 
దాంతో మరో 100 మంది మృత్యువాతపడ్డారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఉ.కొరియా అధికారులు స్పందించలేదు. ఇటీవల ఉత్తర కొరియా అతపెద్ద హైడ్రోజన్‌ బాంబ్‌ను పరీక్షించడంతో ఆ ప్రదేశం మొత్తం దెబ్బతింది. దాంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని జపాన్‌ మీడియా వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికాపై కయ్యానికి కాలుదుతున్న ఉ.కొరియాకు ఈ ఘటన గట్టి ఎదురుదెబ్బే.