ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (11:11 IST)

భారత్‌పై అణు బాంబులతో దాడికి సిద్ధమవుతున్న పాకిస్థాన్?

భారత్‌పై అణు బాంబులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. వివిధ అంశాలపై అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను భారత్ ఏకాకి చేస్తోంది. ముఖ్యంగా, ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ప్రపంచ వేదికలపై భారత్ ఎండ

భారత్‌పై అణు బాంబులతో దాడి చేసేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. వివిధ అంశాలపై అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను భారత్ ఏకాకి  చేస్తోంది. ముఖ్యంగా, ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ప్రపంచ వేదికలపై భారత్ ఎండగడుతోంది. పైగా, భారత్ తెచ్చిన ఒత్తిడి కారణంగా పాక్ ఇచ్చే నిధులను కూడా అమెరికా నిలిపివేసింది. దీంతో భారత్‌పై కక్షగట్టిన పాకిస్థాన్... అణ్వాయుధాలను ఎక్కుపెడుతోందని రిపోర్టులు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ చేతిలో దాదాపు 140 అణు ఆయుధాలు ఉండవచ్చని ఓ అంచనా. వీటన్నింటినీ ఓ రహస్య ప్రదేశంలో దాచేందుకు పాక్ యత్నిస్తోంది. దీనికోసం సొరంగాన్ని నిర్మిస్తోందని ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్ పేర్కొంది. పాక్‌లోని మియన్ వాలీ పట్టణం సమీపంలో ఈ సొరంగాన్ని నిర్మిస్తోందని తెలిపింది. 
 
ఈ సొరంగాలు ఉన్న ప్రదేశానికి మిస్సైల్ లాంచర్లను తీసుకెళ్లేందుకు వీలుగా భారీ రోడ్లను కూడా నిర్మిస్తోందట. మియన్ వాలీ పట్టణం భారత్‌కు సమీపంలో ఉంటుంది. అమృతసర్‌కు 350 కిలోమీటర్లు, ఢిల్లీకి 750 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తక్కువ దూరంలోనే అణ్వాయుధాలను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా... భారత్‌పై దాడికి సన్నద్ధంగా ఉండాలనేదే పాకిస్థాన్ ఆలోచనగా ఉంది.