'We're all in 2017 while she's in 3017' : వాకిలిని ఇలా శుభ్రం చేయొచ్చు (Video)
సాధారణంగా ఇంటి వాకిలిని మహిళలు నడుం వంచి చీపురుతో శుభ్రం చేస్తుంటారు. అయితే, పెద్ద పెద్ద ప్రాంగణాలు, వాకిళ్లను చీపురు పట్టుకుని శుభ్రం చేయాలంటే చాలా కష్టం. ఎక్కువగా సేపు నడుము వాల్చి పనిచేయడం వ
సాధారణంగా ఇంటి వాకిలిని మహిళలు నడుం వంచి చీపురుతో శుభ్రం చేస్తుంటారు. అయితే, పెద్ద పెద్ద ప్రాంగణాలు, వాకిళ్లను చీపురు పట్టుకుని శుభ్రం చేయాలంటే చాలా కష్టం. ఎక్కువగా సేపు నడుము వాల్చి పనిచేయడం వల్ల చాలా నొప్పి కలుగుతుంది. అలాంటి కష్టం నుంచి గట్టెక్కడానికి ఈ పాకిస్థానీ మహిళ ఓ కొత్త విధానాన్ని కనిపెట్టింది.
తన రోజువారీ వాకిలి శుభ్రం పనికి కొద్దిగా సాంకేతికతను జోడించింది. హోవర్ బోర్డ్ మీద కూర్చుని వాకిలి మొత్తం శుభ్రం చేసింది. ఆమె అలా శుభ్రం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదండోయ్... ఈ వీడియో చూసినవారంతా ఆ మహిళ సాంకేతికతకు కొత్త అర్థం చెప్పిందంటూ ప్రశంసిస్తున్నారు. ఆ వీడియోనూ మీరూ చూడండి.
ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను 16 వేల మంది లైక్ చేయగా, ఆరు వేల మంది తమతమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు. మరో 5645 మంది ఈ వీడియోను షేర్ చేయడం గమనార్హం. "ఉయ్ ఆర్ ఇన్ 2017.. వైల్ షి ఈజ్ ఇన్ 3017" అంటూ సర్కాస్‌మిస్టన్ ట్యాగ్‌లైన్‌లో ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది.