పబ్ జి గేమ్‌కు బానిసయ్యాడు... భార్య అలా అందని ఆ పని చేశాడు...
ప్రస్తుతం బాగా ట్రెండింగ్‌లో ఉన్న గేమ్ పబ్జీ. ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా వ్యసనంలా మారిపోయింది. ఈమధ్యనే ఈ గేమ్ ఆడుకునేందుకు తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. తాజాగా పబ్జీ గేమ్‌ను వ్యసనంగా అలవాటు చేసుకున్న వ్యక్తి గురించి అతని భార్య ఫేస్బుక్లో చేసిన పోస్ట్ అందరినీ నివ్వెరపరుస్తోంది.
తాజాగా పబ్జీ గేమ్‌కు బానిసగా మారిన ఒక వ్యక్తి గర్భంతో ఉన్న తన భార్యను, బిడ్డను వదిలేసాడు. మలేసియాకు చెందిన ఒక వ్యక్తి ఈ మధ్యనే పబ్జీ గేమ్ ఆడటం ప్రారంభించాడు. మొదట్లో అతను బాగానే ఉన్నప్పటికీ క్రమంగా దానికి బానిసయ్యే కొద్దీ రాత్రిళ్లు నిద్రపోయేవాడు కాదు.
ఇంటిని వ్యాపారాన్ని అస్సలు పట్టించుకోవడమే మానేసాడు. అలా చేయవద్దని భార్య ఎన్నిసార్లు చెప్పినా తన మాట లెక్కచేయని అతడు తిరిగి ఆమెనే నిందించేవాడు. ఇంటిలో ఉండే గేమ్ ఆడటం కుదరదని భావించిన అతను నెల రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయాడు.
ఎన్నిరోజులైనా భర్త ఇంటికి రాకపోవడంతో అతని భార్య ఫేస్బుక్లో తన గోడునంతా చెప్పుకుని, తన భర్త ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వమని కోరింది. ఇది విన్న వారంతా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ముక్కున వేలేసుకుంటున్నారు.