శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 జులై 2021 (11:16 IST)

భారత విమాన సర్వీసులపై యూఏఈ ఆంక్షల సడలింపు

భారత విమాన సర్వీసులపై యూఏఈ ఆంక్షల సడలింపు ఇచ్చింది. తాజాగా దుబాయ్‌ ఫ్లాగ్‌షిప్ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ కూడా భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఆగస్టు 07 వరకు బ్యాన్‌ను పొడిగించింది.

భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక విమానాలకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. అలాగే గడిచిన 14 రోజుల్లో ఈ నాలుగు దేశాలతో కనెక్ట్ అయిన ప్రయాణికులు ఇతర ఏ దేశాల గుండా యూఏఈలో ప్రవేశానికి అనుమతించబడరని ఎమిరేట్స్ స్పష్టం చేసింది.

యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యాధికారులు, కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం ప్రత్యేక అనుమతి పొందిన వారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. మహమ్మారి కరోనా నేపథ్యంలో భారత్ నుంచి యూఏఈకి ప్రయాణాలపై ఆంక్షలు విధించడం జరిగిందని జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అథారిటీ పేర్కొంది.