శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:35 IST)

వైమానిక సేవలను పునరుద్ధరించండి: భారత్ కు తాలిబన్ల వినతి

ఆఫ్ఘనిస్థాన్‌-భారత్ మధ్య వైమానిక సేవలను పునరుద్ధరించాలని తాలిబన్ ప్రభుత్వం కోరింది. కాబూల్‌కు వాణిజ్య విమానాలను పునరుద్ధరించాలని కోరుతూ డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)కు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ఓ లేఖ రాసింది.

ఈ లేఖను భారత దేశ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోంది.  ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన తర్వాత కాబూల్‌కు వైమానిక సేవలను భారత దేశం నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రయాణికుల సంచారం సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఈ లేఖను రాస్తున్నట్లు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ తెలిపింది.

ఆఫ్ఘనిస్థాన్‌-భారత్ మధ్య వైమానిక సేవలను పునరుద్ధరించాలని కోరింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ క్యారియర్స్ (అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్, కామ్ ఎయిర్) తమ షెడ్యూల్డు ఫ్లైట్స్‌ను పునరుద్ధరించాలనుకుంటున్నట్లు తెలిపింది.

తమ కమర్షియల్ ఫ్లైట్స్‌ పునరుద్ధరణకు అవకాశం కల్పించాలని ఆఫ్ఘనిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ కోరుతోందని పేర్కొంది. భారత దేశం కాబూల్‌కు చిట్ట చివరిగా ఆగస్టు 21న విమానాన్ని నడిపింది. భారత వాయు సేన విమానంలో భారత పౌరులను కాబూల్ నుంచి తీసుకొచ్చింది.