బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (18:16 IST)

ఇటలీలో కరోనా రోగులకు రోబోల సేవలు

కరోనా రోగుల చికిత్సలో వైద్యులకు సహాయంగా ఇటలీలోని ఓ ఆస్పత్రిలో రోబోలను ఉపయోగిస్తున్నారు. బాధితులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేసేందుకు వీటిని వినియోగిస్తున్నారు.

కరోనా బారి నుంచి వైద్య సిబ్బందిని రక్షించేందుకు ఇటలీ లాంబార్డి ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో రోబోల సేవలను వినియోగిస్తున్నారు.

ఐసోలేషన్‌ వార్డులో ఉన్న రోగులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. రోగులను నేరుగా కలవకుండా వారికి అవసరమైన అన్నిరకాల సేవలను రోబోల ద్వారా అందిస్తున్నారు.

వీటిని ఉపయోగించడం వల్ల వైద్యులు కరోనా బారి నుంచి తప్పించుకోవడమే కాకుండా... వైద్య సిబ్బంది కొరత తీరుతోందని వారీస్ సిర్కోలో ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. రోగులు సైతం రోబోలతో కమ్యునికేట్ అవుతూ అవసరమైన సేవలను పొందుతున్నారు.