శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (09:22 IST)

కరోనాతో అల్లాడుతున్న రాష్ట్రాలకు జీఎస్టీ మినహాయింపు

కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాల పట్ల ఉదారంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. జీఎస్టీతో పాటు పెండింగ్ నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది.

అక్టోబరు, నవంబరు నెలలకు గాను నిన్న రూ.14,103 కోట్లను కేంద్రం విడుదల చేసినట్టు తెలుస్తోంది. అంతకుముందే తొలి విడత నిధులు రూ. 19,950 కోట్లను విడుదల చేసింది. అంటే మొత్తంగా రూ. 34,053 కోట్లను విడుదల చేసింది.

డిసెంబరు, జనవరి నెలల నిధులను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం. మరోవైపు, జీఎస్టీ వసూళ్లపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది.

అంతకుముందు వరుసగా నాలుగు నెలలపాటు లక్ష కోట్లకుపైనే జీఎస్టీ వసూలైంది. అయితే, మార్చిలో ఇది రూ.97,597 కోట్లకు పడిపోయింది. జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటకపోవడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి.