శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (08:13 IST)

కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది : మంత్రి ఆదిమూలపు

కరోనా నివారణలో భాగంగా చేపట్టే అన్ని సహాయక చర్యలు పారదర్శకంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పత్రికా సమావేశంలో  మంత్రి మాట్లాడారు.

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కోవిడ్-19, కరోనా ను ఎదుర్కొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాధి పరీక్షలకు సంబంధించి మెడికల్ కిట్లు అన్నీ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా, కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సహాయక చర్యలను సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి ప్రతిరోజూ సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.

పారదర్శకత, జవాబుదారీ తనం, అవినీతి రహిత పాలన మూడు అంశాలను ప్రభుత్వం పాటిస్తున్నదని గుర్తుచేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయం తగదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.