రష్యాను వణికిస్తున్న కరోనా.. నాలుగు లక్షలకు దాటిన కేసులు
కరోనా మహమ్మారి రష్యాను వణికిస్తోంది. ఆ దేశంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కరోనా బాధిత దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాలో కేసుల సంఖ్య ఇప్పటికే నాలుగు లక్షలు దాటింది. సోమవారం కొత్తగా 9,035 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 414,878కు చేరింది. గడిచిన 24 గంటల్లో 162 మంది చనిపోయారు. ఇప్పటివరకు రష్యాలో కరోనా వల్ల 4,855 మంది మరణించారు.
ఇక భారత్ విషయానికి వస్తే మొన్నటి వరకు పదో స్థానంలో ఉండేది రెండు మూడు రోజుల్లోనే ఏడో స్థానానికి చేరుకుంది. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్‌లలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 18,37,170 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,06,195 మంది మరణించారు.
అలాగే బ్రెజిల్, స్పెయిన్ దేశాల్లో మరణాల సంఖ్య 50 వేలు దాటింది. ఇటలీలో 33 వేలు, రష్యాలు 4,600 మంది మృత్యువాత పడ్డారు. ఫ్రాన్స్‌లో 28 వేల మంది వరకు మరణించారు. ఇక బ్రిటన్‌లో అయితే మరణాల సంఖ్య 39 వేలకు చేరుకుంది. లాక్డౌన్ సడలింపులు, వాతావరణంలో మార్పు వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందనేది అధికారులు అంచనా వేయలేకపోతున్నారు.