ఈ ఉగాది కాలసర్ప దోషంతో ప్రారంభమైంది : స్వాత్మానందేంద్ర స్వామి
ఈ యేడాది ఉగాది కాలసర్ప దోషంతో ప్రారంభమైందని, వచ్చే ఉగాది వరకూ ఒడిదొడుకులు తప్పవు అని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జూన్ ఎనిమిదో తేదీ ఆలయాలు తెరిచాక విశేష పూజలు, యజ్ఞ యాగాలు నిర్వహించాలన్నారు.
ఆధ్యాత్మిక చింతనతో మానసిక స్థైర్యం పెరిగి కరోనా పై భయం దూరమౌతుందన్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం విషయంలో అనేక మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఇది మంచిది కాదు అన్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రాజమండ్రి ఎం.పి మార్గాని భరత్ రామ్ దంపతులు నిర్వహించిన మూడు రోజుల యాగాలు ముగింపు పూర్ణాహుతిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన...
టి.టి.డి ఆస్తుల వివాదాన్ని ఎ.పి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించడం అభినందనీయమన్నారు.