షాకింగ్ విజువల్స్... రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 15 మంది దుర్మరణం
రష్యాలో సైనిక విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృత్యువాతపడ్డారు. రష్యా సైన్యానికి చెందిన ఐఎల్ 76 రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రష్యా రాజధాని మాస్కోకు 125 మైళ్ల దూరంలోగల ఇవనోవోలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 15 మంది దుర్మణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విమాన సిబ్బంది, మరో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. కాగా, ఈ విమానం కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం గురించి రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు కోసం హుటాహుటిన మిలిటరీ కమిషన్‌ను ఇననోవో ఎయిర్‌బేస్‌కు పంపినట్టు తెలిపింది. కాగా గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతుండటంతో రష్యాలో సైనికులు, సైనిక సామాగ్రి రవాణా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్ తమ ఐఎల్ 76 సైనిక విమానాన్ని కూల్చేసిందని రష్యా ఈ యేడాది జనవరి నెలలో ప్రటించింది.