షెడ్యూల్ ప్రకారమే ఎస్-400 క్షిపణులు: పుతిన్
ఎస్-400 క్షిపణులను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే భారత్‌కు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యా నుంచి రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదంటూ ఇంతకుముందు భారత్‌ను అమెరికా హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఎస్-400 కొనుగోలుకే నిర్ణయించుకున్నట్లు సమాధానమిచ్చిన భారత్.. రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. మరికొంతకాలంలో భారత అమ్ములపొదిల ఈ అత్యాధునిక క్షిపణులు చేరనున్నాయి.
భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే ఎస్-400 క్షిపణులను షెడ్యూల్ ప్రకారమే భారత్‌కు అందించేందుకు యోచిస్తున్నామని స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.
రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను కొనుగోలు వద్దంటూ ఒప్పందానికి ముందు భారత్‌ను అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రణాళిక ప్రకారమే ఎస్-400 అందించనున్నామని ప్రకటన చేశారు పుతిన్.