శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (18:01 IST)

దోమే కాదు.. స్వలింగ సంపర్కంతో కూడా డెంగ్యూ వస్తుందట.. (video)

డెంగ్యూ జ్వరం దోమకాటుతో వస్తుందని వైద్యులు చెప్తుంటారు. అపరిశుభ్ర ప్రదేశాల్లో ఉండే దోమల కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ముందు ప్రజల్లో అవగాహన లేకపోవడంతో పాటు… దోమకాటు నుంచి రక్షణ తీసుకోకపోవడం, వ్యాధి లక్షణాలు తెలియక అశ్రద్ధ చేయడంతో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. 2019లో భారతదేశంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరిగింది. డెంగ్యూ ఏడెస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. 
 
సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మ దద్దుర్లు. ఈ వ్యాధి వైరస్లు పదిరోజుల వరకు వుంటాయి. సరైన వైద్యం అందకపోవడంతో డెంగ్యూతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. 
 
తాజాగా ఈ వ్యాధి గురించి ఒక సంచలన విషయం బయటపడింది. స్వలింగ సంపర్కం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందని ఒక కేసు ద్వారా బయటపడింది. స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్‌ నగరానికి చెందిన 41 ఏండ్ల ఓ స్వలింగ సంపర్కుడు డెంగ్యూ సోకిన తన సహచరుడితో లైంగిక చర్యలో పాల్గొనడంతో అతనికి కూడా డెంగ్యూ వచ్చిందని వైద్యులు గుర్తించారు. 
 
వైద్య నిపుణులు ఇచ్చిన వివరాల మేరకు డెంగ్యూ ఫీవర్ స్పెర్మ్, మర్మాంగాల ద్వారా ఒకరి శరీరం నుంచి ఇంకొకరి శరీరంలోకి వ్యాప్తిస్తాయని.. ఈ విషయాన్ని 37 రోజుల పాటు డెంగ్యూ సోకిన వ్యక్తి నుంచి గ్రహించారు. డెంగ్యూ సోకిన వ్యక్తి సెక్స్‌కు దూరంగా వుంటే.. ఈ వ్యాధి ఇంకొకరికి సోకే ప్రమాదం తప్పుతుందని వైద్యులు చెప్తున్నారు.