మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (17:27 IST)

డెంగ్యూ జ్వరానికి ఔషధ తయారీ.. అరటిదూట, పుదీనా వుంటే? (Video)

వర్షాకాలంలో జలుబు, దగ్గుతో పాటు వైరల్ ఫీవర్, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలు కూడా జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరంతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతుంది.

ఇంకా కొందరు ఈ జ్వరంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే డెంగ్యూ జ్వరాన్ని నియంత్రించేందుకు ఆయుర్వేద వైద్యులు ఓ ఔషధాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటున్నారు. 
 
ఈ డెంగ్యూ ఔషధ తయారీకి ఏం కావాలంటే? డెంగ్యూ జ్వరాన్ని వ్యాపించకుండా చేసేందుకు ఐదురకాల ఆకులే చాలునని వారు చెప్తున్నారు. డెంగ్యూ జ్వరానికి ఇంట్లోనే ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు.

అదెలాగంటే..10 తమలపాకులు, పుదీనా ఆకులు ఒక కప్పు, కరివేపాకు పొడి మూడు టేబుల్ స్పూన్లు, కొత్తి మీర తరుగు గుప్పెడు, అరటి దూట ఒక కప్పు. 
 
వీటినన్నింటిని ఒక పాత్రలోకి తీసుకుని ఒక లీటర్ నీటిలో బాగా మరిగించి అరలీటర్ అయ్యాక దించేయాలి. ఈ కషాయాన్ని ఆరిన తర్వాత ఇంట్లో వున్న అందరూ సేవిస్తే.. డెంగ్యూ జ్వరాన్ని నియంత్రించడం సులభం అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.