శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (15:32 IST)

అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో తొలి భారతీయుడు.. ఐసిస్‌ కోసం ఆ పనిచేశాడు..

భారత్‌ నుంచి ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ఉగ్రమూకలను తరలించిన కర్ణాటకకు చెందిన మొహ్మద్ షఫీ అర్మర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో అమెరికా చేర్చింది. తద్వారా అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో స్థానం సంపాదించుకున్

భారత్‌ నుంచి ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ఉగ్రమూకలను తరలించిన కర్ణాటకకు చెందిన మొహ్మద్ షఫీ అర్మర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో అమెరికా చేర్చింది. తద్వారా అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో స్థానం సంపాదించుకున్న తొలి భారతీయుడిగా షఫీ అర్మర్ నిలిచాడు. కర్ణాటకకు చెందిన ముహ్మద్ షఫీ (30)పై ఇంటర్ పోల్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులిచ్చారు. 
 
ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడంతో.. షఫీ అర్మర్ తన సోదరుడితో పాకిస్థాన్‌కు పారిపోయాడు. టెక్నాలజీలో ఆరితేరిన ఇతడు.. ఫేస్‌బుక్ ద్వారా భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఐసిస్‌కు ఉగ్రవాదులను తరలించాడు. గత 2013 నేపాల్‌లో యాసిన్ భత్కల్‌ను అరెస్ట్ చేయగా.. విచారణ మొహ్మద్ షఫీ బండారం బయటపడింది. 
 
ఆపై ఎన్ఐఎ పోలీసులు విచారణ జరిపారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఐసిస్ ఉగ్రవాద సంస్థకు మనుషులను తరలించే ముఠాకు షపీ నాయకత్వం వహించాడని.. భారత్‌లోని ఉగ్రవాద చర్యలకు పాల్పడిన ఐఎస్ మద్దతుదారులకు ఇతడు సహకరించాడని తెలిపింది. ఇంకా ఐసిస్‌కు పంపే వారికి ఆయుధాలతో షఫీ శిక్షణ కూడా ఇచ్చాడని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.