మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (18:28 IST)

ఎగిరే విమానంలో వేలాడిన ఇద్దరు మృతి..? కాల్పుల్లో ఐదుగురు బలి

airport
ఆప్ఘనిస్థాన్ ఎయిర్ పోర్టులో పరిస్థితి దారుణంగా మారింది. విమానం ఎక్కేందుకు జనాలు నానా తంటాలు పడుతున్నారు. విమానం ఎక్కే క్రమంలో ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో విమానం నుంచి జారిపడుతున్నారు. 
 
తాలిబన్ల ఆక్రమణతో తలో దిక్కుకు పరిగెడుతున్న జనం. ఎక్కడికి వెళుతున్నారో.. ఎలా బతుకుతారో తెలియదు. ముందు అక్కడి నుంచి బయట పడితే ప్రాణాలన్నా నిలుస్తాయన్న తలంపుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో జనం తోసుకుంటూ ఎక్కుతున్నారు. మరో మార్గం లేక రెక్కలపైన కూడా కూర్చున్నారు. విమానం గాల్లోకి ఎగరడంతో అంత ఎత్తు మీద నుంచి క్రింద పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి.
 
అఫ్గనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌ను తాలిబన్ల ఆక్రమించుకోవడంతో వేలాది మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విదేశాలకు పారిపోతున్నారు. ఆదివారం నుంచి కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. 
Kabul
 
దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించగానే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోవడం.. వాహనాలు ఎక్కేందుకు ప్రజలు ఎగబడినట్టు ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయ పరిస్థితి అలానే ఉంది. వేలాది మంది ప్రజలు దేశం వీడేందుకు ఏకంగా విమానాల వద్దకే పరుగులు పెడుతున్నారు. ప్రయాణికులను అదుపుచేయడానికి కాల్పులు జరపడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.