బుధవారం, 26 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (08:22 IST)

సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది మృత్యువాత

plane crash
దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మిలటరీ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖార్జూమ్ సమీపంలోని వాది సీద్నా ఎయిర్ బేస్ నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ విమానం రన్‌వేపై పరుగులు పెట్టి టేకాఫ్ అవుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మృతి చెందారు. వీరిలో ఆర్మీ అధికారులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. అలాగే, పలువురికి గాయాల్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానానికి మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టింది. కాగా, టేకాఫ్‌లో సమస్యలు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే, ఈ ప్రమాదంలో కనీసం 20 మంది వరకు చనిపోయినట్టు అనధికారిక వర్గాల సమాచారం.