శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (15:55 IST)

చైనా కొత్త మ్యాప్‌- తీవ్రంగా ఖండించిన ఆసియా దేశాలు

india vs china
భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, తైవాన్ ప్రభుత్వాలు చైనా నూతన జాతీయ మ్యాప్‌ను తిరస్కరించాయి. చైనా ఇటీవల తన జాతీయ పటం కొత్త వెర్షన్‌ను ప్రచురించింది. దీనిలో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమ దేశంలోని భాగంగా చూపింది. 
 
అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను చైనా తన మ్యాప్‌లో చూపించడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అలాగే చైనా మ్యాప్ 2023 వెర్షన్‌పై ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మండిపడింది. 
 
సముద్ర ప్రాంతాలపై చైనా తన సార్వభౌమాధికారంతో పాటు అధికార పరిధిని చట్ఠబద్ధం చేయడానికి ఈ కొత్త ప్రయత్నాలు చేస్తోందని.. ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని  ఫిలిప్పీన్స్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మా తెరెసిటా దాజా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఫిలిప్పీన్స్ గతంలోనూ చైనా తీరుపై నిరసన వ్యక్తం చేసింది. అలాగే మలేషియా, వియత్నాం, తైవాన్ వంటి ఆసియా దేశాలు కూడా ఈ మ్యాప్‌పై తమ నిరసనను వ్యక్తం చేశాయి.