మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఫిలిప్పీన్స్‌లో కూలిన విమానం.. భారత ట్రెయినీ పైలెట్ మృతి

ఫిలిప్పీన్స్‌లోని అపాయోవా ప్రావిన్స్‌లో చిన్న విమానం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత ట్రైయినీ పైలెట్ కూలిపోయింది. విమానం కూలిన ఘటనా స్థలాన్ని సిబ్బంది గుర్తించి, మృతుల కోసం గాలిస్తున్నారు. ఈ విమానం మంగళవారం లావోంగ్ నగరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో చనిపోయిన భారతీయ ట్రైనీ పైలెట్ రాజ్‌కుమార్‌ కొండేగా గుర్తించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విమానం అదృశ్యమైనట్టు వెలుగులోకి రాగానే అత్యవసర సిబ్బంది,  ఎయిర్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకిదిగారు. విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించారు. అయితే, విమానంలోని ఇద్దరి మృతదేహాల కోసం ఇంకా గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం లావోంగ్ నగరం నుంచి విమానం బయలుదేరింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దాన్ని ఆచూకీ తెలియకుండా పోయింది. ఆ తర్వాత విమానం కూలిపోయినట్టు తేలింది. ఫిలిప్పీన్స్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు మృతుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారతీయ ట్రైనీ ప్రైలెట్ మృతి చెందాడని అధికారులు నిర్ధారించారు.