శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (14:45 IST)

పిలిప్పీన్స్ లో భారత కబడ్డీ కోచ్ దారుణ హత్య

భారత్ కు చెందిన కబడ్డీ కోచ్ దారుణ హత్యకు గురయ్యాడు.  వివరాల్లోకి వెళితే.. పిలిప్పీన్స్ రాజధాని మనీలాలో భారత్ లోని పంజాబ్ మోగాకు చెందిన కబడ్డీ కోచ్ గుర్ ప్రీత్ సింగ్ గిండ్రూను దుండగులు కాల్చి చంపేశారు. 
 
నాలుగేళ్ల క్రితం పిలిప్పీన్స్ వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన క్రమంలో బుధవారంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు కాల్పులు జరిపారు. 
 
దీంతో తలలో తూటాలు దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కబడ్డీ హత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.