బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (20:07 IST)

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

అగ్రనటి నయనతార ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్మ ఏం చెబుతుందంటే అనే పేరుతో ఆమె ఈ ట్వీట్ చేశారు. ఇందులో 'కర్మం ఏం చెబుతుందంటే అబద్దాలతో నువ్వు ఇతరుల జీవితాలను నాశనం చేస్తే అదొక అప్పు అవుతుంది. ఆ అప్పు వడ్డీతో సహా తిరిగి నీ దగ్గరికే వస్తుంది' అంటూ నయనతార తన పోస్టులో పేర్కొంది. 
 
కోలీవుడ్ హీరో ధనుష్ - నయనతారల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెల్సిందే. కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌కు సంబంధించిన వివాదంలో వీరిద్దరి మధ్య ఈ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. నానుమ్ రౌడీదాన్ అనే సినిమా క్లిప్పింగ్స్‌ను నయనతార తన డాక్యుమెంటరీలో ఉపయోగించకోవడంపై ఒక నిర్మాతగా ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.10 కోట్లకు దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది.