బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (15:55 IST)

ఆఫ్ఘనిస్థాన్‌లో వైమానిక దాడులు.. 14మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం

అమెరికా దళాలు ఆఫ్ఘన్ నుంచి వైదొలిగిన నాటి నుంచి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయి. భద్రతా దళాలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతున్నారు ఉగ్రవాదులు. ఇక ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు కూడా ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి దాడి చేశాయి వైమానిక దళాలు. 
 
ఇలా ఆఫ్ఘనిస్థాన్ వైమానిక దళాలు జరిపిన దాడిలో 14 మంది తాలిబన్ ఉగ్రవాదులు మరణించారు. ఫిరోజ్ నఖ్చిర్ సబర్బన్ జిల్లాలోని కుష్మల్ గ్రామంలో తాలిబన్ రహస్య స్థావరంపై వైమానిక దళాలు దాడులు చేశాయి. ఈ దాడిలో 14 మంది అక్కడికక్కడే చనిపోయినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
ఈ దాడి సోమవారం రాత్రి జరిగినట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు స్థావరంలో ఉంచిన గ్రేనేడ్ లాంచర్లు, రెండు భారీ తుపాకులు, మరికొన్ని మారణాయుధాలు కూడా ధ్వంసమైనట్లు ప్రకటించారు.