Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

'నాసా' పోటీల్లో సత్తా చాటిన తెలుగోళ్లు

Written By ఠాగూర్
Updated: సోమవారం, 23 ఆగస్టు 2021 (17:48 IST)
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) నిర్వహించిన పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థుల్లో ముఖ్యంగా మహిళలు తమ సత్తా చాటారు. చంద్రుడిపై చేపట్టే పరిశోధనల్లో భాగంగా ఈ పోటీలను నాసా నిర్వహించింది. ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన బృందం సత్తా చాటింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల్లో వెయ్యికిపైగా బృందాలు పాల్గొనగా, తెలుగు బృందం టాప్‌-10లో నిలిచి 25 వేల డాలర్లు (సుమారు రూ.18.8 లక్షలు) గెల్చుకోవడంతోపాటు రెండోదశ పోటీలకు ఎంపికైంది. చంద్రునిపై ఉన్న మంచును నీరుగా మార్చే చర్యల్లో భాగంగా ‘నాసా’ గత ఏడాది నవంబరులో ఈ పోటీలకు శ్రీకారం చుట్టింది. 
 
‘బ్రేక్‌ ది ఐస్‌ లూనార్‌ చాలెంజ్‌’ పేరుతో చేపట్టిన పోటీలకు ఔత్సాహిక పరిశోధకుల నుంచి ప్రాజెక్ట్‌లను ఆహ్వానించింది. దీంతో వెయ్యికిపైగా ప్రాజెక్టులు వచ్చాయి. వీటిలో 48 దేశాలకు చెందిన 374 ప్రాజెక్టులను పోటీలకు ఎంపిక చేసింది. 
 
రాష్ట్రానికి చెందిన కరణం ఆశీష్ కుమార్‌, అమరేశ్వర ప్రసాద్‌ చుండూరు, ప్రణవ్‌ ప్రసాద్‌ రూపొందించిన ఎల్‌-వాటర్‌(లూనార్‌ వాట ర్‌ అబ్‌స్ట్రాక్షన్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ బై ఎక్సకవేషన్‌ ఆఫ్‌ రెగోలిత్‌) ప్రాజెక్ట్‌ టాప్‌-10లో నిలిచింది. 25 వేల డాలర్లను బహుమతిగా గెల్చుకోవడంతో పాటు రెండో దశ పోటీలకు ఎంపికైంది. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments