`సలార్` కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న శ్రుతిహాసన్!
ప్రతిభ కలిగిన నటీమణుల్లో శృతి హాసన్ ఒకరు. సోషల్ మీడియాలో తనకు నచ్చిన ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. కరోనాకు ముందు బాక్సింగ్ నేర్చుకుంటున్న పిక్స్ కూడా ఆమె అభిమానులతో పంచుకుంది. అప్పట్లో ఏ సినిమాలో ఆమె క్లారిటీ ఇవ్వలేదు. తాజా సమాచారం మేరకు జులైలో దానికి సంబంధించిన సన్నివేశాలు తీయనున్నట్లు తెలుస్తోంది. అది ప్రభాస్ నటిస్తున్న `సలార్` సినిమా కోసమట. ఇంతకుముందు రవితేజతో `క్రాక్`, పవన్ కళ్యాణ్‌తో `వకీల్‌సాబ్` సినిమాలు చేసినా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ సలార్ సినిమాలో ఆమె చేస్తున్న పాత్ర కీలకమని తెలుస్తోంది.
అందుకే కథ ప్రకారం యాక్షన్ సీన్స్ కోసం మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ పొందుతున్నట్టు సమాచారం. కెజిఎఫ్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతోంది. ఇది పాన్ ఇండియా మూవీగా రూపొందబోతోంది. ప్రభాస్‌తో కలిసి శ్రుతి నటించడం, అది పాన్ ఇండియా మూవీ కావడం విశేషమనే చెప్పాలి. సలార్ సినిమా కొంత భాగం షూటింగ్ అయ్యాక కరోనా వల్ల వాయిదా పడింది. జులై మొదటివారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.