మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 19 జూన్ 2021 (21:24 IST)

డార్లింగ్ స్థానాన్ని టార్గెట్ చేసిన కోలీవుడ్ దళపతి, వందకోట్లు ఖాయమేనా..?

ఒకప్పుడు వందకోట్ల వసూళ్లు అంటేనే గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ వేరు. స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుండటంతో బడ్జెట్ లెక్కలు 500, 600 కోట్లకు చేరాయి. వసూళ్ళ నెంబర్ అయితే ఇంకా భారీగానే ఉంటోంది. దీంతో హీరోల పేమెంట్లు కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. 
 
ఆల్రెడీ వందలకోట్లు రీచ్ అయిన హీరోలు పేమెంట్ల విషయంలో తగ్గేది లేదంటున్నారట. డార్లింగ్ ప్రభాస్ వందకోట్ల పేమెంట్ అందుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్ సినిమాతో ఇండియాలోనే ఎక్కువ పేమెంట్ అందుకుంటున్న స్టార్‌గా అవతరించారట ప్రభాస్.
 
ఇప్పుడు ఆ ప్లేస్‌ను టార్గెట్ చేస్తున్నారట కోలీవుడ్ దళపతి విజయ్. వరుసగా వందలకోట్ల వసూళ్ళను సాధిస్తున్న విజయ్ నెక్ట్స్ పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఆల్రెడీ మాస్టర్ సినిమాను నార్త్ ఇండియాలో రిలీజ్ చేసిన దళపతి నెక్ట్స్ సినిమా మేకింగ్ నుంచి పాన్ ఇండియా స్టాండర్స్ ఫాలో అవుతున్నారట.
 
రీజనల్ సినిమాతోనే 300 కోట్లకు పైగా వసూళ్ళను సాధించిన విజయ్‌తో పాన్ ఇండియా సినిమాతో వసూళ్ళు మరో రేంజ్‌లో ఉంటాయంటున్నారు ఫ్యాన్స్. నెల్సన్ దిలీప్ సినిమా తరువాత టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ప్లాన్ చేస్తున్నారట విజయ్. ఈ సినిమాకు ఏకంగా వందకోట్ల పేమెంట్ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పేమెంట్ విషయంలో డార్లింగ్‌కు పోటీ ఇస్తున్న ఒకే ఒక్క హీరో విజయ్ అవుతారంటున్న సినీ విశ్లేషకులు.