డైలీవేజెస్‌గా అలియాభట్ - అందుకు దీపికా నో
బాలీవుడ్‌లో తారా మణులు తాము చేసే సినిమాల్లో పాత్ర నిడివి ఎంత వుంటుంది. ఏమేరకు పారితోషికం అనేది చూస్తారు. తెలుగులో రావడానికి మాత్రం కొంచెం సడలింపులు ఇస్తుంటారు. గతంలో అలా నటించిన భామలు వున్నారు. ఇప్పుడు అలియాట్ తను చేస్తున్న ఆర్.ఆర్.ఆర్. సినిమాకు రోజువారీ పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఆమె రామ్‌చరణ్ సరసన నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ సాగింది. ప్రస్తుతం ఓ పాటను కొంత పేచ్‌వర్క్ చేయాల్సివుంది. ఈ సినిమా కోసం ఆమె రోజుకు 50లక్షలు తీసుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆమెతోపాటు ఐదుగురు సిబ్బంది వుంటారు. వారికి రానుపోను ఎకామిడేషన్ సెపరేట్. ఇలాగా ప్రతి బాలీవుడ్ తారలు తెలుగు సినిమాల్లోకి రావడానికి తమతోపాటు తమ సిబ్బందికి సెపరేట్‌గా పారితోషికం వుంటుంది.
ఇక మరో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తన సినిమాలకు భారీగానే పారితోషికం తీసుకుంటుందట. తాజాగా ఆమె క్రికెట్ నేపథ్యంలో సాగుతున్న `83` సినిమాకు 14 కోట్లు తీసుకుందని ట్రేడ్ వర్గాలు అంచనావేశాయి. అదేవిధంగా ఇప్పటికే ఆమె చేసిన `పటాన్` సినిమాకు 15 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో సెట్‌పైకి వెళ్ళబోయే సినిమాలో దీపికానే కథానాయికగా ఎంపిక చేశారు. అయితే అలియాభట్ తరహాలో రోజువారీగా తీసుకోవడానికి ఆమె అంగీకరించలేదని సమాచారం. మరో నాయికగా కూడా ఇందులో నటించనుంది. ఆమె ఎవరనేది త్వరలో క్లారిటీ వస్తే అప్పుడు దీపికా పారితోషికం ఎంత అనేది తెలుస్తోందని చిత్ర వర్గాలు తెలియజేస్తున్నాయి.