బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (11:57 IST)

''దెయ్యం'' ఆ నటుడి దేహంలోకి ప్రవేశించిందా? (video)

సోషల్ మీడియాలో వైరల్ కోసం ఏవేవో సాహసాలు చేస్తూ వీడియోలు పోస్టు చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. సెల్ఫీలు, లైవ్ వీడియోలెన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. ఓ నటుడు దెయ్యంలా ప్రవర్తించి తోటి నటు

సోషల్ మీడియాలో వైరల్ కోసం ఏవేవో సాహసాలు చేస్తూ వీడియోలు పోస్టు చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. సెల్ఫీలు, లైవ్ వీడియోలెన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. ఓ నటుడు దెయ్యంలా ప్రవర్తించి తోటి నటులను వణికించాడు. ఈ దృశ్యాలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. కాంబోడియాలో దెయ్యం ప్రధాన పాత్రగా ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో దెయ్యంగా నటిస్తోన్న ఓ నటుడు షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా దెయ్యంలాగే కదలకుండ, మెదలకుండా కూర్చున్నాడు. అంతే అంతా కంగారుపడ్డారు. వణికిపోయారు. దెయ్యం అతనిలో ప్రవేశించిందని భ్రమపడ్డారు. 
 
అయితే ఆ వ్యక్తి నటిస్తున్నాడని తెలుసుకోలేకపోయిన తోటినటులు ఆపై అసలు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు. అయితే తనలోకి నిజంగానే దెయ్యం ప్రవేశించినట్లు నటించిన నటుడు తోటి నటులపై దాడి చేశాడు. చివరకు తోటి నటులను భయపెట్టేందుకే అలా చేశానని తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మీరూ ఓ లుక్కేయండి.