బ్రిటీష్ టూరిస్ట్ తీసిన సెల్ఫీ అదరహో... నెటిజన్లంతా ఫిదా అయిపోయారు
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్. ఎక్కడ చూసినా సెల్ఫీల పిచ్చోళ్లు. పిచ్చ పీక్ స్టేజ్ చేరింది. అవసరంలేని అతి ప్రాణాలు తీసుకెళ్లి.. పనికిరాని సెల్ఫీ ఒకటి మిగిల్చిపోతోంది. మార్కెట్ మాయలోపడిన ప్ర
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్. ఎక్కడ చూసినా సెల్ఫీల పిచ్చోళ్లు. పిచ్చ పీక్ స్టేజ్ చేరింది. అవసరంలేని అతి ప్రాణాలు తీసుకెళ్లి.. పనికిరాని సెల్ఫీ ఒకటి మిగిల్చిపోతోంది. మార్కెట్ మాయలోపడిన ప్రపంచం స్మార్ట్‌ఫోన్‌తో చేస్తున్న సావాసం.. సహజీవనం రాబోయే కాలంలో మనిషిని పిచ్చోడిని చేసేంత ప్రమాదకారిగా మారబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇవేమీ పట్టని వేలం వెర్రి జనం.. సెల్ఫీలతో తమ ప్రాణాలను సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నారు. కాగా వీటన్నింటికి భిన్నంగా బ్రిటీష్ టూరిస్ట్ తీసుకున్న సెల్ఫీ అందరిని అబ్బురపరుస్తోంది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా వినియోగించుకుంటూ చక్కటి సెల్ఫీని తీసి అందరిచేత వాహ్వా అనిపించుకున్నాడు. అమెరికాలో న్యూయార్క్‌లోని ఎంపైర్‌స్టేట్ బిల్డింగ్‌పై సెల్ఫీ తీసుకోవడం అందరికీ ఓ క్రేజ్.
కానీ, బ్రిటీష్ టూరిస్ట్ తీసిన సెల్ఫీలా ఇప్పటివరకు ఎవ్వరూ తీయలేదు. 1250 అడుగుల ఎతైన భవనం.. దట్టంగా కమ్ముకున్న మేఘాలు, న్యూయార్క్ నగరం వీటిని 360 డిగ్రీల కోణంలో చూపిస్తూ చక్కగా తీసిన ఫొటో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. అందరి కంటే వింతగా, అందరి కంటే ముందుగా, సరికొత్తగా ఓ సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అతను తీసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.