గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (18:13 IST)

వరుణ్ తేజ్‌పై 'మట్కా' ప్రమోషన్ బాధ్యతలు - శ్రీవారి సేవలో పాల్గొన్న యూనిట్

varun in matka
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం "మట్కా". ఈ నెల 14వ తేదీన విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం ప్రమోషన్ కోసం వరుణ్ తేజ్ స్వయంగా రంగంలోకి దిగి ముమ్మర ప్రచారం చేశారు. హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కొసం‌ ముంబై కూడా వెళ్లారు. ఈ సినిమాకు థియేటర్స్ కూడా భారీగా కేటాయించారు. కానీ 'మట్కా'కు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సరైన రెస్పాన్స్ కనిపించటం లేదు.
 
వరుణ్ గత చిత్రాల ఎఫెక్ట్ 'మట్కా' బుకింగ్స్‌పై పడింది. హైదరాబాద్ నగరంలో సైతం అడ్వాన్స్ బుకింగ్స్ 10 శాతం లోపే ఉంది‌. ఆన్‌లైన్‌లో స్క్రీన్స్ అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 'మట్కా'‌కు మౌత్ టాక్ పాజిటివ్‌గా రావాల్సి ఉంది. లేదంటే షోస్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన విషయం తెల్సిందే. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ చిత్రానికి కె.అరుణ కుమార్ దర్శకత్వం వహించగా, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరిలు కలిసి నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం. మరోవైపు, ఈ చిత్రం సక్సెస్ కావాలని చిత్ర బృందం తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు.