గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (10:39 IST)

సపోర్టు చేసిన వారిని మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనిరాదు : వరుణ్ తేజ్ (Video)

varun matka
మనం ఉన్నతస్థానానికి చేరుకునేందుకు సహాయపడినవారిని మరిచిపోతే మనం ఎంత సక్సెస్ సాధించినా అది ఎందుకు పనికిరాదని మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం "మట్కా". ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, బాబాయ్, పెదనాన్న నా గుండెల్లో ఉంటారు. అందరూ వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడతావు అని అడుగుతారు. మా బాబాయ్, మా పెదనాన్న, మా అన్నయ్య చరణ్ గురించి నేను మాట్లాడుతాను. అది నా ఇష్టం. లైఫ్‌లో నువ్వు పెద్దోడివి అవ్వొచ్చు అవ్వకపోవచ్చు. కానీ నువ్వు ఎందుకు, ఎక్కడ మొదలుపెట్టావు.. నీ వెనక సపోర్ట్ ఎవరు ఇచ్చారు అని నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదు అని అన్నారు. 
 
చిరంజీవి, బాబాయ్ కళ్యాణ్, నాన్న, అన్నయ్య.. వాళ్ళు నా మసన్సులో ఉంటారు. వాళ్ళు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు అన్నాడు. వరుణ్ ఇలా  మాట్లాడిన వ్యాఖ్యలు బన్నీ ని ఉద్దేశించేనా అని హాట్ టాపిక్‌గా మారింది. నాగబాబు కూడా గతంలో ఇదే తరహాలో బన్నీపై ట్వీట్ వేసి డిలీట్ చేశారు. మరి ఇప్పుడు వరుణ్ తేజ్ వ్యాఖ్యలు బన్నీకి కౌంటరా అనే చర్చ మొదలైంది.