మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (10:53 IST)

తొలి ఏకాదశినాడు దేవుడి దర్శనం ఆనందాన్నిచ్చింది : వరుణ్ తేజ్

Varuntej at tiruma
Varuntej at tiruma
వరుణ్ తేజ్ ఈరోజు తిరుమల దర్శనం చేసుకున్నారు. మట్కా సినిమా రిలీజ్ రేపు కానుంది. ఈ సందర్భంగా తమ టీమ్ తో వచ్చి దేవుడి దర్శనం చేసుకున్నామని తెలియజేశారు. ఉదయమే తిరుమల దర్శనానికి వెళ్ళిన వరుణ్ తేజ్ వెంట చిత్ర నిర్మాతలు హాజరయ్యారు. దేవస్థానంకు చెందిన ముఖ్యులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడారు.
 
ఎప్పటిలాగే స్వామి దర్శనానికి రావడం, దర్శించుకోవడం జరుగుతుంది. కొత్త సినిమా రిలీజ్ వుంది. తొలి ఏకాదశి కావడం మరింత ఆనందంగా వుంది. టీమ్ అంతా దేవుడిని దర్శనం చేసుకోవాలని వచ్చాం అన్నారు. ఈ సందర్భంగా కొత్త సినిమాల గురించి విలేకరులు అడగగా, సున్నితం తిరస్కరిస్తూ తర్వాత చెబుతానన్నారు. 
 
ఇక ఈ సినిమా కథపరంగా చెప్పాలంటే.. ఆప్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఆ తర్వాత ఇండియా వచ్చిన ఓ వ్యక్తి మట్కా అనే జూదానికి కేంద్ర బిందువుగా మారతాడు. ఆయన దగ్గర ఎంత డబ్బువుందంటే.. మట్కాను లీగల్ చేస్తే ఇండియా కున్న అప్పు తీర్చేస్తానన్నాడు. అందుకే ఈ కథ బాగుందని ఆ పాత్రను చేశానని వరుణ్ తేజ్ తెలిపారు. నవంబర్ 14న విడుుదలకానుంది.