డొనాల్డ్ ట్రంప్ రెస్టార్ట్‌లో కరోనా కలకలం.. డైనింగ్ రూమ్‌లో సేవలు రద్దు
ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభిస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతుందనే చెప్పాలి. ఫలితంగా అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రెజిల్, ఫ్రాన్స్‌లలో కోవిడ్ భారీగా వ్యాప్తిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిసార్టులో కరోనా కలకలం సృష్టించింది. ట్రంప్‌కు ఫ్లోరిడాలో మార్ ఏ లాగో అనే రిసార్టు ఉంది. అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో రిసార్టును పాక్షికంగా మూసివేశారు.
అయితే ఎంత మందికి కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని క్లబ్ మేనేజ్‌మెంట్ స్పష్టంగా వెల్లడించడం లేదు. ట్రంప్ జనవరిలో అధ్యక్షపదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి ఈ రిసార్టు అధికార నివాసంగా ఉంది.
రిసార్టులోని కొంతమంది ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో బీచ్ క్లబ్, లా కార్ట్ డైనింగ్ రూమ్‌లో సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని క్లబ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. సీడీసీ నిబంధనలకు అనుగుణంగా బాన్‌క్వెట్, ఈవెంట్ సేవలు కొనసాగుతాయని తెలిపింది.