శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (19:11 IST)

కరోనా మహమ్మారితో డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కలు కనిపించాయట.. ఊపిరితిత్తుల్లో?

Donald Trump
అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన చాలా తొందరగానే కోలుకున్నట్లు అనిపించినా.. మరణం అంచుల వరకూ వెళ్లి వచ్చాడని తాజాగా వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో గత ఏడాది అక్టోబర్‌లో వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్‌కు ట్రంప్‌ను తరలించారని చెప్పారు. 
 
ఊపిరి తీసుకోలేకపోయారని, బయటి నుంచి ఆక్సిజన్ అందించాల్సి వచ్చిందని వివరించారు. ఒకానొక సమయంలో ఆయన్ను వెంటిలేటర్ మీద పెట్టాలన్న నిర్ణయానికీ వచ్చినట్టు చెబుతున్నారు. ఆయన ఊపిరితిత్తులకూ ఇన్ఫెక్షన్ పాకిందని.. బ్యాక్టీరియా, కొన్ని రకాల ద్రవాలతో ఊపిరితిత్తులు వాచాయి.. దీని వల్ల ట్రంప్ ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయులు 80ల్లోకి పడిపోయాయని వైద్యులు తెలిపారు.
 
ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శాన్ కోన్లీ మాత్రం చికిత్స సమయంలో ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు. ఆయనకు ఆక్సిజన్ పెట్టలేదని, మామూలుగానే ఉన్నారని మీడియాకు చెప్పారు. బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ ఆశిష్ ఝా స్పందిస్తూ, కోన్లీ తీరుపై మండిపడ్డారు. కోన్లీ నిజాలు చెప్పడంలో విఫలమయ్యారని.. ఆ సమయంలో కోన్లీ మోసపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.