బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (10:20 IST)

భారత్‌కు వెళ్లే పౌరులకు అమెరికా వార్నింగ్.. జమ్మూకాశ్మీర్‌కు మాత్రం వెళ్లొద్దు..

భారత్‌కు వెళ్లే తమ పౌరులను అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. నేరాలతో పాటు ఉగ్రవాదం కారణంగా అప్రమత్తంగా వుండాలని ముఖ్యంగా.. జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వెళ్లవద్దని అమెరికా పౌరులకు సూచించింది. 
 
ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రయాణ సూచనలను జారీ చేసిన అమెరికా విదేశాంగ శాఖ అందులో భారత్‌కు చేసే ప్రయాణాలకు ఇచ్చే రేటింగ్‌ను రెండుకు తగ్గించింది. ఇంతకుముందు భారతదేశానికి ప్రయాణ రేటింగ్ ఒకటిగా ఉండేది.
 
భారత దేశంలో నేరాలు, ఉగ్రవాద ప్రమాదం నేపథ్యంలో అమెరికా పౌరులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వెళ్లవద్దు. 
 
తూర్పు లడఖ్ ప్రాంతానికి మాత్రం అప్రమత్తతతో ఉంటూ వెళ్లవచ్చునని అమెరికా పేర్కొంది. భారత్‌లో నేరాలు ఎక్కువగా వున్నాయని అందుచేత అక్కడికి వెళ్లే అమెరికా పౌరులు అప్రమత్తంగా వుండాలని సూచించింది.