అమెరికా ఎన్నికల ఎఫెక్ట్: మళ్లీ ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు

సోమవారం, 21 సెప్టెంబరు 2020 (07:38 IST)
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలొస్తే చాలు.. ఏదొ ఒక ముస్లిం దేశంపై యుద్ధానికి కాలు దువ్వడం సర్వసాధారణం అయిపోయింది. తద్వారా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను దక్కించుకోవడం ఆ దేశాధ్యక్షులకు పరిపాటైపోయింది.

ఇందులో భాగంగా త్వరలో అక్కడ ఎన్నికలు  జరుగనుండగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకారణంగా పాత శత్రువు ఇరాన్ తో గిల్లికజ్జాలకు దిగారు. ఇరాన్‌పై ఆంక్షలన్నింటినీ మళ్లీ పునరుద్ధరించినట్లు అమెరికా ప్రకటించింది.

2015లో అణుఒప్పందం ప్రకారం ‘జాయింట్‌ కాంప్రిహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌’ (జేసీపీఓఏ)లోని నిబంధనల్ని ఇరాన్‌ ఏమాత్రం పాటించడం లేదని అమెరికా ఆరోపించింది. దీంతో భద్రతా మండలి చట్టాల నియమాల ప్రకారం నోటీసు ఇచ్చి 30 రోజుల గడువు ముగియడంతో తక్షణమే ఆంక్షలు అమలులోకి వచ్చాయని ప్రకటించింది.

ఈ ఆంక్షలను ఉల్లంఘిస్టే ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వివరిస్తూ శ్వేతసౌధం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలన్నీ ఈ ఆంక్షల్ని తప్పనిసరిగా పాటించాలని అమెరికా విదేశాంగశాఖ సెక్రటరీ మైక్‌ పాంపియో అన్నారు.

లేదంటే కఠిన చర్యలకు సిద్ధం కావాలని హెచ్చరించారు. ఇరాన్‌పై ఆంక్షల విషయంలో అమెరికా తీరును యూఎన్‌ఎస్‌సీలోని ఇతర సభ్యదేశాలు వ్యతిరేకించాయి. అమెరికా ప్రకటనను తిరస్కరించాలని నిర్ణయించాయి.  

అన్నీ చూడండి

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments