శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (12:51 IST)

అమెరికా వైమానిక దళానికి ఏమైంది?.. కుప్పకూలిన మరో విమానం

అమెరికాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ దేశ వైమానిక దళానికి చెందిన ఐదు విమానాలు ఇప్పటికే కుప్పకూలగా తాజాగా ఆ జాబితాలోకి మరొకటి చేరింది.

న్యూమెక్సికోలో మంగళవారం తెల్లవారు జాయిన 3:50 గంటల సమయంలో అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్‌-16 జెట్‌ కుప్పకూలింది. హోలోమన్‌ ఎయిర్‌బేస్‌లో ఈ ఘటన జరిగింది.

సాంకేతిక సమస్య తలెత్తడంతో జెట్‌ విమానం అదుపు తప్పిందని, అయితే ఫైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించారు.

ఈ ఏడాది మే నుండి ఇప్పటికీ ఐదు విమానాలు కూలిపోగా, గత రెండు వారాలలో రెండు ఎఫ్‌-6 జెట్లు ప్రమాదానికి గురయ్యాయి.